
ఒక డాక్టర్ అయిన నేను, ఏదో ఒక సందర్భములో మతాల గురించి తెలుసుకుందామని, అసలు దేవుడెవరు, ఈ సృష్టిని దేవుడే తన దివ్య శక్తితో నిర్మించాడా అని కుతూహులం కలిగి, అన్ని గ్రంధాలను చదవడం మొదలు పెట్టాను. అలా అన్ని మత గ్రంధాలు చదువుతూ, అధ్యయణం చేస్తూ ఎన్నో కొత్త విషయాలను తెలుసుకో సాగాను. తరువాత కొందరితో పరిచయం ఏర్పడింది. సమాజంలో ఇతర మతాలు ఎలా మోసాలు, కుట్రలు చేస్తూ, మతాలని వ్యాపారంగా మార్చి, మత మార్పిడీ చేస్తున్నారో తెలిసింది. ఒకప్పుడు నాస్తిక భావాలు ఉన్న నేను, దేవుడుంటాడని నమ్మకం కలిగింది. హిందూ మతము అనే సనాతన ధర్మంలో ఎన్నో సైన్సుకు సంబంధించిన విషయాలు కనిపించాయి. అలాగే అబ్రహమిక్ మతాలలో ఎన్నో విషయాలు పొంతన లేకుండా కనిపించాయి.
ప్రతి రొజూ చదువుతూ, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నా నేను, ఆ విషయాలని అందరికి తెలియ చేయాలని అనుకుని, ఈ ధర్మ మార్గం ఛానల్ ని మొదలు పెట్టాను. ప్రేక్షకులు నా వీడియోలను తప్పని సరిగా చూసి, వాటిని అర్థం చేసుకొని, మీరూ గ్రంధాలను పరిశీలించి నిజాలను తెలుసుకోగలరు. ఏమైనా ప్రశ్నలు, అనుమానాలు ఉంటే నా Email కి మీ ప్రశ్నలని పంపగలరు.
For queries post your questions or phone number to Email-dharmamargam2017@gmail.com
0 Yorumlar